'మా మమ్మి, పప్పా లాగా అందరు వెళ్లి ఓటు వేయండి'....జీవా

SMTV Desk 2019-05-07 13:05:00  MS Dhonis daughter Ziva asks people to vote like her parents

రాంచి: ఐపీఎల్ లో బిజీబిజీగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కాప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోమవారం లోక్ సభ ఎన్నికల ఐదవ విడత పోలింగ్ సందర్భంగా కుటుంబంతో కలిసి రాంచిలో ఓటేశాడు. అయితే ఓటేసిన అనంతరం ధోని కూతురు జీవా నెటిజన్లకు ఓ చక్కటి సందేశం ఇచ్చింది. తన తండ్రి ధోని ఒళ్ల్లో కూర్చొని మా మమ్మి, పప్పా లాగా అందరు వెళ్లి ఓటు వేయండి అంటూ చెప్పింది. ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ గ మారింది. ధోని అభిమానులు మాత్రం ఈ వీడియొ చూసి తెగ మురిసిపోతున్నారు. గత కొద్ది రోజులుగా ఐపీఎల్‌ టోర్నీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఆడుతూ ఎంఎస్ ధోనీ బిజీబిజీగా ఉన్నారు. మొహాలీ వేదికగా ఆదివారం పంజాబ్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాంచీకి చేరుకున్నారు. చెన్నైప్లే ఆఫ్ చేరుకున్న విషయం తెలిసిందే. నేడు చెన్నై వేదికగా ముంబై, చెన్నై జట్ల మధ్య క్వాలిఫైయర్ -1 మ్యాచ్ జరగనుంది.