పూర్తి మెజారిటీ రావడం కష్టం

SMTV Desk 2019-05-07 12:31:16  Ram Madhav,

ఒకవైపు అమిత్ షా లాంటి నేతలు ఈసారి బీజేపీ క్రితంసారి కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని గొప్పలు చెబుతుంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాత్రం ఈసారి తమకు అంత సీన్ లేదని చెబుతున్నారు. గతంలో వచ్చినన్ని సీట్లు ఈసారి రాకపోవచ్చన్న అయన ఎన్డీఏ మిత్ర పక్షాల ఏర్పాటుతో ఆ లోటును పూడ్చుకుంటామని అంటున్నారు.

ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత పనిచేయడం, దక్షిణ భారతం పై సరిగా దృష్టి నిలపకపోవడం వంటి కారణాల రీత్యా సొంతగా 271 సీట్లు సాదించలేకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. కానీ పశ్చిమ బెంగాల్, ఒడిశలలో మంచి మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇలా ఒక పార్టీ ముఖ్య నేత తమకు మెజారిటీ రాదని చెప్పడంతో ఇతర నేతలు ఖంగుతిన్నారు.

ఆయన మాటల్ని బట్టి మోడీ, అమిత్ షా, అరుణ్ జైట్లీల మాటలు మెకపోతు గాంభీర్యమనే అర్థం వస్తుందని, ఇంకా రెండు దశల ఎన్నికలు మిగిలే ఉండగా ఇలాంటి స్వయంకృతాపరాధపు మాటలేమిటని వాపోతున్నారు.