లాభాల్లో ఐసిఐసిఐకి మళ్ళీ నిరాశే...

SMTV Desk 2019-05-07 12:26:08  icici, icici bank

న్యూఢిల్లీ: క్యూ4(జనవరి- మార్చి) ఫలితాల్లో కూడా ఐసిఐసిఐ మరోసారి నిరాశపర్చింది. 2019 మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 5 శాతం క్షీణించగా...సంస్థ లాభం కేవలం రూ.969 కోట్లు నమోదయ్యింది. బ్యాంకు ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. సంస్థ మొత్తం ఖర్చులు 18.1 పెరిగి 14,680 కోట్లకు చేరుకున్నాయి. నికర వడ్డీ ఆదాయం 27 శాతం పెరిగి రూ.7,620 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో నికర వడ్డీ ఆదాయం రూ.6,022 కోట్లుగా ఉంది.ఇతర ఆదాయం 36 శాతం క్షీణించి రూ.3,261 కోట్లుగా నమోదవగా, గత ఏడాది ఇదే సమయంలో రూ.5679 కోట్లుగా ఉంది. అలాగే గత త్రైమాసికంతో పోలిస్తే వడ్డీ మార్జిన్లు 3.40 శాతం నుంచి 3.72 శాతాని చేరాయి. గత త్రైమాసికంతో పోలిస్తే ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) 2.58 శాతం నుంచి 2.06 శాతానికి తగ్గాయి. మొత్తం వ్యయం 18.1 శాతం వృద్ధితో 14,680 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే రూ.6,626 కోట్ల నుంచి రూ.5451 కోట్లకు తగ్గిన కేటాయింపులు. ఐసిఐసిఐ బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 7.75 శాతం నుంచి 7.38 శాతానికి తగ్గాయి. ఒక్కో షేరుకు రూ.1 డివిడెండ్ చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. బిఎస్‌ఇలో ఐసిఐసిఐ బ్యాంక్ షేరు విలువ 0.11 శాతం నష్టపోయి రూ.401.40 వద్ద ముగిసింది.