ఖలీల్‌ అహ్మద్‌ను వెక్కిరించిన విరాట్

SMTV Desk 2019-05-06 18:33:47  srh vs rcb, ipl 2019, virat kohli, khaleel ahmed, Virat Kohli impersonating Khaleel celebrations

ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడిన మ్యాచ్ లో బెంగుళూరు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్‌ పేసర్ ఖలీల్‌ అహ్మద్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా ఆటపట్టించాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగిలింది. మొదటగా పార్థివ్ పటేల్ (0) పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు.ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో విరాట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చాడు. విరాట్ అవ్వడంతో ఖలీల్‌ అహ్మద్‌ తన చేతులతో విచిత్రంగా సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీని ఖలీల్‌ కలిసాడు. ఆ సమయంలో కోహ్లీ కూడా అచ్చం ఖలీల్‌ లాగానే చేతులు ఊపుతూ సరదాగా ఆటపట్టించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు. దీనికి సంబందించిన వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.