ఫణి తుపాన్‌ను కూడా మమత రాజకీయం చేస్తుంది. .. ఎంత అహంకారం ...

SMTV Desk 2019-05-06 17:14:41  Mamata, benerjee, Modi,

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ప్రధాని నరేంద్ర మోడీ తనదైన శైలిలో విమర్శించారు. ఫణి తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి ఎలా ఉందని వాకుబు చేసేందుకు ఫోన్ చేశానని వివరించారు. మమతకి రెండు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటే ఆమెకు ఎంతో అహంకారం ఉందో ఆలోచించుకోవాలన్నారు. ఫణి తుపాన్‌ను కూడా మమత రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. మొదటి సారి ఫోన్ చేసినప్పుడు ఆమె లిఫ్ట్ చేయలేదని, ఆమె తనకు రీటర్న్ ఫోన్ చేస్తుదనుకున్నా ఆమె చేయకపోవడంతో మళ్లీ తాను రెండో సారి దీదీకి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదన్నారు. ఫణి తుపాన్ ఇప్పటికే ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఒక్క ఒడిశాలోని తుపాన్ ధాటికి 20 మంది మృతి చెందినట్టు సమాచారం. ఫణి తుపాన్ నేపథ్యంలో ఒడిశాకు తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు రూ.10 కోట్లు, ఛత్తీసగఢ్ రూ.11 కోట్లు, గుజరాత్ ఐదు కోట్ల రూపాయలు సహాయం అందిస్తున్నాయి.