'ఆర్ ఎక్స్ 100' కి సీక్వెల్ రాబోతుందా?

SMTV Desk 2019-05-05 19:07:56  payal rajput, rdx love, rx 100, venky mama

ఆర్ ఎక్స్ 100 సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతో పాయల్ రాజ్ పుత్ యూత్ హృదయాలను పొలోమంటూ దోచేసింది. ఈ సినిమా తరువాత పాయల్ ను వెతుక్కుంటూ వరుస సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలో వెంకీమామ .. డిస్కోరాజా తరువాత ఆమె మరో సినిమాను అంగీకరించింది. ఆర్ డి ఎక్స్ లవ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమా ద్వారా భానుశంకర్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే ఈ సినిమా ఆర్ ఎక్స్ 100 సినిమాకి సీక్వెల్ అనే ప్రచారం జోరందుకుంది. దాంతో ఈ విషయంపై పాయల్ స్పందిస్తూ .. ఆర్ డి ఎక్స్ లవ్ నాయికా ప్రాధాన్యత కలిగిన చిత్రమని చెప్పింది. ఈ సినిమాకి .. ఆర్ ఎక్స్ 100 సినిమాకి ఎక్కడా ఎలాంటి పోలికలు ఉండవని అంది. ఆర్ డి ఎక్స్ లవ్ పూర్తిగా వేరే జోనర్లో వుంటుందని స్పష్టం చేసింది.