భారతీయుడు-2 తాజా అప్ డేట్

SMTV Desk 2019-05-05 18:49:44  Bharatheeyudu, Kamal hasan

ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు2 మొదలైంది. కొద్దిరోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది. దీనిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్ కి స్కిన్ అలర్జీ కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారని. ఈ ప్రాజెక్ట్ నుంచి నిర్మాణ సంస్థ లైకాప్రొడక్షన్ తప్పుకొందనే ప్రచారం జరుగుతోంది. సినిమ బడ్జెట్ ఎక్కువ అవుతుందనే కారణంగా లైకా సైడ్ అయినట్టు చెబుతున్నారు. ఇందులో నిజమెంత? అనేది తెలీదు. కానీ దర్శకుడు శంకర్ భారతీయుడు సినిమా కోసం రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే లైకా ప్రొడక్షన్స్ బదులు రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ రంగంలోకి దిగనుంది. ఈ సినిమా షూటింగ్
తిరిగి జూన్ నుంచి మొదలవుతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.