సినిమా డైలాగులు చెప్పిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్

SMTV Desk 2019-05-05 18:37:42  wwe, WWE SUPERSTARS LEARN BOLLYWOOD DIALOGUES & MOVES

డబ్ల్యూడబ్ల్యూఈ (వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్మెంట్‌) స్టార్స్ నోట సినిమా డైలాగ్‌లు వినిపించాయి. ఇటీవల ఈ స్టార్లు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్లతో బాలీవుడ్‌ సినిమాల హిట్‌ డైలాగ్‌లు చెప్పించింది డబ్ల్యూడబ్ల్యూఈ. అయితే దానికి సంభందించిన వీడియో ఇప్పుడా యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. ఇందులో షోలే సినిమాలోని డైలాగ్‌లే ఎక్కువ చెప్పించడం గమనార్హం. స్టెఫ్నీ మెక్‌మాన్‌, లేసీ ఎవాన్స్‌, కర్ట్‌ యాంగిల్‌, సెథ్‌ రోలిన్స్‌, రోమన్‌ రెయిన్స్‌, మార్క్‌ హెన్రీ, మాట్‌ హార్డీ, పేజ్‌, చార్లెట్‌ ఫ్లెయిర్‌, నయా జాక్స్‌, న్యూ డే లాంటి స్టార్లు ఈ డైలాగ్‌లు చెప్పారు. రింగ్‌లో వీరు ఆడే ఆట డమ్మీ అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ డైలాగ్‌లు చెప్పడం మాత్రం నిజమే.