బాలీవుడ్ నటిని వెంబడించిన వ్యక్తిపై కేసు నమోదు

SMTV Desk 2019-05-05 17:44:37  bollywood actress, nani heroine, shudd desi romance, vani kapoor

బాలీవుడ్ నటి వాణీ కపూర్‌ను బైక్‌పై వెంబడించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బేఫికర్ , శుద్ధ్ దేశీ రొమాన్స్ వంటి సినిమాల్లో నటించిన వాణీ కపూర్‌తో మాట్లాడాలని భావించిన ఓ అభిమాని ఆమె కారును తన బైక్‌తో వెంబడించాడు. ముంబైలోని వెర్సోవా నుంచి బాంద్రా వరకు అతడు తన కారును వెంబడించినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వాణి పేర్కొంది.

తన డ్రైవర్ కారు వేగాన్ని పెంచినప్పటికీ అతడు మాత్రం తమను వెంబడించడం మానలేదని తెలిపింది. కొన్ని కిలోమీటర్ల పాటు తనను అతడు వెంబడించాడని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిందితుడిని సమీర్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు.