మీ ఖర్మ కాలే సమయం వచ్చింది

SMTV Desk 2019-05-05 17:24:46  Rahul gandhi, Modi,

ఢిల్లీ: రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతిపరుడని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ లో స్పందించారు. మోడీ జీ… పోరు ముగిసింది. మీ ఖర్మ కాలే సమయం వచ్చింది. నా తండ్రిపై చేసే విమర్శలూ మిమ్మల్ని కాపాడలేవు. మీపై ప్రేమతో ఓ కౌగిలింత… రాహుల్” అని ట్వీట్ చేశారు. మోడీ వ్యాఖ్యలపై చిదంబరం స్పందిస్తూ…ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసి మరణించిన వ్యక్తిని విమర్శించడం సరికాదని చిదంబరం మండిపడ్డారు.