అందుకే బిజెపి పార్టీని విమర్శిస్తున్న : ప్రకాష్ రాజ్

SMTV Desk 2019-05-05 16:22:44  AAm aadmi party, prakash raj

ఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్థాపించిన ఆమ్‌ఆద్మీ పార్టీకి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆమ్‌ఆద్మీ పార్టీ సిద్ధాంతలు నచ్చాయని,దేశంలో ఏ పార్టైనా పాలించడానికి కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. దేశంలో రెండు జాతీయ పార్టీల పరిస్థితీ బాగాలేదని, ప్రధాని మోడీ పాలనలో పూర్తిగా విఫలమయ్యారని, ఆయనో నటుడిగా మారారని ప్రకాశ రాజ్ అన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోందని ,బిజెపి ప్రభుత్వం సరైన దారిలో వెళ్లట్లేదని అందుకే బిజెపి పార్టీని విమర్శిస్తున్నానని ప్రకాశ్‌ రాజ్‌ పేర్కొన్నారు.