టీ20 ముంబై లీగ్ లో రూ.5 లక్షలు పలికిన జూనియర్ టెండూల్కర్

SMTV Desk 2019-05-05 15:54:03  arjun tendulkar, sachin tendulkar, t20 mumbhai league

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను టీ20 ముంబై లీగ్ రెండో సీజన్ కోసం రూ.5 లక్షలకు కొనుగోలు అయ్యాడు. ఆకాష్ టైగర్స్ ముంబై వెస్టర్న్ సబర్బ్ అర్జున్ ను శనివారం కొనుగోలు చేసింది. ఈ లీగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్ ఉన్నారు. వేలంలో అర్జున్ ని ఆల్ రౌండర్ కేటగిరీలో రూ.లక్ష బేస్ ప్రైస్ తో చేర్చడం జరిగింది. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలరైన అర్జున్ భారత్ అండర్-19 జట్టు తరఫున అనధికార టెస్ట్ ఆడాడు. చాలా జట్లు అతని కోసం వేలం పాడాయి. కానీ నార్త్ ముంబై పాంథర్స్ రూ.5 లక్షల అత్యధిక వేలం పాడింది. ఆ తర్వాత వేలంపాట నిర్వహించిన చారూ శర్మ రెండు కొత్త జట్లు-ఆకాష్ టైగర్స్ ముంబై వెస్టర్న్ సబర్బ్, ఈగల్ ఠాణే స్ట్రైకర్స్ కి సరిసమానమైన అవకాశం (ఓటీఎం) ప్రత్యామ్నాయం ఇచ్చారు. లీగ్ మే 14 నుంచి వాంఖేడే స్టేడియంలో ప్రారంభమవుతుంది.