ఈ సీజన్ మాకు కలిసి రాలేదు....వచ్చే సీజన్‌లో కచ్చితంగా రాణిస్తాం

SMTV Desk 2019-05-04 18:54:36  ipl 2019, royal challengers bengulore, rcb virat kohli, ab di villers

బెంగుళూరు: ఐపీఎల్ 2019 సీజన్లో మొట్ట మొదటగా నిష్క్రమించిన రాయల్ చాలెంజేర్స్ బెంగుళూరు జట్టు నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు. ఈ సీజన్‌లో విఫలమయ్యాం. వచ్చే సీజన్‌లో కచ్చితంగా మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. దానికి మీ మద్దతు ఎంతో ముఖ్యం అని కోహ్లీ అభిమానులను కోరాడు. ఈ సీజన్ మాకు కలిసి రాలేదు. గెలవాల్సిన మ్యాచ్‌లలో కూడా ఓడిపోయాం. రాజస్థాన్‌తో జరిగిన ఆ ఐదు ఓవర్ల మ్యాచ్‌ ఎప్పటికి మరిచిపోలేను. ఫలితం రాకపోయినప్పటికీ ఆ మ్యాచ్‌ను నా జీవితంలో గుర్తుండిపోతుంది అని డివిలియర్స్‌ చెప్పాడు. చాలా బాధగా ఉంది. అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించండి. బెంగళూరు జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంలో జట్టుగా విఫలమయ్యాం. అయినా కూడా మా వెంటనే ఉంటున్నందుకు మీకు కృతజ్ఞతలు. వచ్చే సీజన్‌లో కచ్చితంగా రాణిస్తాం. అప్పుడు కూడా మీ మద్దతు కావలి అని ఓ భావోద్వేగపూరిత వీడియోను బెంగళూరు యాజమాన్యం ట్విటర్లో పోస్టు చేసింది.