ఆ జిల్లాలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ప్రదర్శన .. ఈసీ వార్నింగ్

SMTV Desk 2019-05-04 18:35:10  election commision, Lakmis NTR,

ఆర్జీవీ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ఏ త‌ర‌హా వివాదాల్ని మోసుకొచ్చిందో తెలిసిందే. ఎన్నిక‌ల కోడ్ పేరుతో ఈ చిత్రాన్ని ఏపీలో రిలీజ్ కానీకుండా తేదేపా ప్ర‌భుత్వం అడ్డు ప‌డింద‌ని ఆర్జీవీ స‌హా నిర్మాత‌లు విమ‌ర్శించారు. ఆ క్ర‌మంలోనే ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ఆర్జీవీ అండ్ టీమ్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఇటీవ‌ల విజ‌య‌వాడ ప్రెస్ మీట్ రాద్ధాంతం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని క‌డ‌ప జిల్లాలోని ఓ రెండు థియేట‌ర్ల‌లో ఎలాంటి అనుమ‌తి లేకుండా ప్ర‌ద‌ర్శించేయ‌డంతో ఈసీ సీరియ‌స్ అయ్యింది. అందుకు కార‌కులైన అధికారుల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ను ఆపేయ‌డంలో జాయింట్ కలెక్టర్ విఫ‌ల‌మ‌య్యారు. దీంతో అత‌డిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు అందింది.