షాంగై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ కు ఎంపికైన తెలుగు సినిమా

SMTV Desk 2019-05-04 16:57:50  cinema, mahanati,

షాంగై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ కు మహానటి సినిమా ఎంపికైంది. గత ఏడాది విడుదలైన మహానటి సినిమా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ నటనకు ప్రజలు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో చైనాలోని షాంగై లో జూన్ 15నుంచి 24 వరకు 22వ షాంగై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుంది. ఇందులో మహానటి సినిమాను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. షాంగైలో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న తొలి భారతీయ సినిమాగా మ‌హాన‌టి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ , సమంత , విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్ర‌సాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ ఈ మహానటి సినిమాను నిర్మించింది. షాంగై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ కు మహానటి ఎంపిక కావడంతో ఆ సినిమా యూనిట్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.