నాని జెర్సీ కలెక్షన్స్ చూస్తే షాక్

SMTV Desk 2019-05-04 12:23:17  Jersey,

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన సినిమా జెర్సీ. ఏప్రిల్ 19న రిలీజైన ఈ సినిమా మొదటి షో నుండి మంచి టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులతో పాటుగా సెలబ్రిటీస్ సైతం ఈ సినిమా చూసి ప్రశంసించారు. అయితే అంతా బాగుంది కాని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి పెద్దగా చేయలేకపోయింది. 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని జెర్సీ రెండు వారాల్లో బిజినెస్ ఎంత చేసిందో అంత మాత్రమే రాబట్టింది.

సూపర్ హిట్ సినిమా కలక్షన్స్ అసలు కావు ఇవి.. ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ అందుకున్నా ఆ తర్వాత అక్కడ సినిమా కలక్షన్స్ డల్ అయ్యాయి. ఏరియా వైజ్ నాని జెర్సీ 2 వారాల కలక్షన్స్ చూస్తే..

నైజాం : 8.67 కోట్లు

ఉత్తరాంధ్ర : 2.28 కోట్లు

సీడెడ్ : 1.89 కోట్లు

నెల్లూరు : 0.63 కోట్లు

కృష్ణ : 1.40 కోట్లు

గుంటూరు : 1.46 కోట్లు

ఈస్ట్ : 1.40 కోట్లు

వెస్ట్ : 1.07 కోట్లు

ఏపీ/తెలంగాణ : 18.80 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.50 కోట్లు

ఓవర్సీస్ : 5.00 కోట్లు

వరల్డ్ వైడ్ : 6.30 కోట్లు