బ్రేకింగ్: యుద్ధనౌకలు సైతం అదుపు తప్పిపోయాయి

SMTV Desk 2019-05-03 18:57:00  fani cyclone, fighter ships, cyclone effect

ఫణి తుఫాన్ అతలాకుతలం చేసేసింది. చెట్లు, తీర ప్రాంతాల్లో ఉన్న జనావాసాలు కొట్టుకుపోయాయి. ఉధృతంగా వీచిన గాలి ధాటికి భారీ నష్టం వాటిల్లింది. షిప్‌ను కుదిపేసేంత తీవ్రంగా గాలులు వీయడంతో డెక్‌లోకి కూడా నీళ్లు చేరుకున్నాయి. భారత నేవీకి చెందిన షిప్ మునిగిపోతుందేమో అనే స్థాయిలో నీళ్లతో డెక్‌ నిండిపోయింది.

వెంటనే అధికారులు అప్రమత్తమవడంతో పెద్ద ప్రమాదాన్ని తప్పించగలిగారు. ఒడిశాలోని కొన్ని ఇంటి పైకప్పులు లేచిపోయాయి. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగినట్లు సమాచారం. వారం రోజులు ముందుగా తుఫాన్ గురించి సమాచారం అందడంతో అధికారులు సహాయచర్యలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు.

సహాయ చర్యల్లో భాగంగా 7యుద్ధ నౌకలు(తమిళనాడు తీర ప్రాంతంతో కలిపి), 7 హెలికాప్టర్లు, వైద్య సిబ్బంది, 6 బృంధాలు, గజ ఈతగాళ్లతో తుఫాన్ బాధితులను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు.