పల్సర్ 150 అప్‌డేట్ వెర్షన్

SMTV Desk 2019-05-03 16:49:46  pulsar 150, pulsar 150 neon

ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ నుండి వచ్చిన పల్సర్ బైక్ ఎంత సక్సెస్ అయ్యిందో తెలిసిందే. పల్సర్ బైక్స్‌లో 150 బైక్‌లో ఉండే ఆదరణే వేరు. ఎంట్రీ లెవెల్ పర్ఫార్మెన్స్ బైక్స్‌లో పల్సర్ 150 నియాయన్ ఏబీఎస్‌ను మించిన బైక్ మరొకటి లేదని చెప్పుకోవచ్చు. తయారీ నాణ్యత, పవర్ ఔట్‌పుట్, ధర వంటి అంశాలు ఈ బైక్‌ను భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ స్పోర్ట్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా నిలిపాయి. పల్సర్ 150 క్లాసిక్ మోడల్‌కు 150 నియాన్ ఎడిషన్ అప్‌డేట్ వెర్షన్. అయితే ఈ బైక్ ఫీచర్స్ చూస్తే ఈ బైక్‌కు డిమాండ్ ఉండటానికి ప్రధాన కారణం ధర. పల్సర్ 150 నియాన్ ఏబీఎస్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.68,250. ఇదే విభాగంలోని హోండా సీబీ యూనికార్న్ 150 ఏబీఎస్ ధర రూ.79,241గా ఉంది. పల్సర్ 150 ఆన్ రోడ్ ధర రూ.80,000లోపు ఉండొచ్చు. పవర్‌ఫుల్ ఇంజిన్ మరోక ప్రత్యేకత. ఇంజిన్ మాగ్జిమమ్ పవర్ 14 హెచ్‌పీ@8000 ఆర్‌పీఎం. మాగ్జిమమ్ టార్క్ 13.4 ఎన్ఎం@6000 ఆర్‌పీఎం. జెట్ స్పీడ్‌లో దూసుకెళ్లాలని ఎవ్వరూ భావించారు. కానీ సిటీలో ఇతర బైక్స్‌ను సులభంగానే ఓవర్‌టెక్ చేయవచ్చు. పల్సర్ 150 నియాన్ ఏబీఎస్ వివిధ రంగుల్లో అదుబాటులో ఉంది. నియాన్ యెల్లో, నియాన్ రెడ్, నియాన్ సిల్వర్ అనే కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది.ప్రతిసారీ పెట్రోల్ బంక్‌కు వెళ్లి వెహికల్‌కు పెట్రోల్ కొట్టించుకోవాలంటే చికాకు వస్తుంది. అయితే ఈ పల్సర్ బైక్‌లో ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే 600 కిలోమీటర్లు వెళ్లొచ్చు. బైక్‌లో సింగిల్ చానల్ ఏబీఎస్ ఫీచర్ ఉంది. ఇది స్టాండర్డ్ ఫీచర్. తొలిసారి బైక్‌ను నడిపేవారు ఈ బైక్‌తో రైడింగ్ స్కిల్స్ పెంచుకోవచ్చు. బజాజ్ ఇతర బైక్స్‌తో పోలిస్తే పల్సర్ 150 నియాన్ విడిభాగాల ధర కూడా తక్కువగానే ఉంది. అలాగే పల్సర్ బైక్‌కు రీసేల్ వ్యాల్యు కూడా ఎక్కువగానే ఉంటుంది.