తడిబట్ట కట్టుకొని తిరగకండి !అనాచారం ,అనారోగ్యం ,అశుభం

SMTV Desk 2019-05-03 13:35:13  wet cloth man,

మడిబట్ట కట్టుకొని పూజ చేసుకోవడం ,వంట చేసుకోవడం చాలా కులాలలో పెద్దవాళ్ళలో ఈ నాటకీ వున్న ఆచారం !మాది బట్ట కట్టుకోవడం శుచి ,శుభ్రతకోసం !వ్యక్తిగతంగా శుచిగా వుంటే మనసు కూడా నిర్మలంగా వుంటుంది . మనం మురికిగా ,నిర్లక్ష్యంగా వుంటే మన మనసు కూడా అందుకు తగ్గేట్లే వుంటుంది . అయితే మడిబట్ట కట్టుకునే విషయంలో కొందరు అతి కి పోతుంటారు వీరిదృష్టిలో మడిబట్ట అంటే తడిబట్ట అని అర్థం ! ఆరినప్పుడల్లా వచ్చి చెంబుల నీరు గుమ్మరించుకొంటూ వుంటారు వీళ్ళు . ఆయుర్వేద శాస్త్రం ఇలా తడిబట్ట కట్టుకొని తిరగడాన్ని పూర్తిగా ఖండించింది . ఇది చాలా దుష్టమైన
ఆచారం అనీ సృష్టంగా చెప్పింది . దీని వలన వాతవ్యాధులన్ని వస్తాయి . ఆయాసం ,దగ్గు ,జలుబు ,క్షయ వంటి వ్యాధులు వస్తాయి . మూత్రవ్యాధులు వస్తాయి . తామర ,ఎగిజమా వంటి చర్మవ్యాధులు వస్తాయి . అజీర్ణ వ్యాధులు కూడా వస్తాయి . ఇదీ హెచ్చరిక !