మరోసారి పొగాకు ఉత్పత్తులపై నిషేధం

SMTV Desk 2019-05-03 13:18:15  Tobacco ban,

ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది లాగా ఈ ఏడాది కూడా పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించింది .. ఉత్పత్తులపై నిషేధాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతా వ్యవహారాల కమిషషనర్‌ ఎల్‌.ఆర్‌.గార్గ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘ప్రజా ఆరోగ్య ప్రయోజనార్థం ఏడాది కాలం పాటు దేశ రాజధాని పరిధిలో పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాం. గుట్కా, పాన్ మసాలా, ఫ్లేవర్డ్ లేదా సెంటెడ్ టొబాకో, ఖర్రా సహా ఎలాంటి పదార్ధాలతో కూడిన పొగాకు మిశ్రామానికీ అనుమతి లేదు...’’ అని ఆహార భద్రతా వ్యవహారాల కమిషనర్ ఎల్ఆర్ గార్గ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అయితే భారీగా అమ్ముడయ్యే సిగరెట్లపై మాత్రం ఎటువంటి నిషేధం విధించక పోవడం గమనార్హం.