పవన్ కళ్యాణ్ మరో మూవీ చేయబోతున్నాడా ?

SMTV Desk 2019-05-03 11:25:48  Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు చిన్నపాటి బ్రేక్ ఇచ్చి ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన ఏపి ఎలక్షన్స్ లో జనసేన పార్టీ పోటీ చేసిన విషయం తెలిసిందే. రిజల్ట్ ఎలా ఉన్నా మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తాడు అన్న విషయం తెలిసిందే. అసలైతే సూర్య మూవీస్ బ్యానర్ లో సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ పవన్ తో సినిమాకు రెడీ అవుతున్నారట.

ఈ సినిమాకు దర్శకుడిగా హరీష్ శంకర్ పేరు వినపడుతుంది. ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమా తీసిన హరీష్ శంకర్ ఆ సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు. గబ్బర్ సింగ్ కు సీక్వల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ అని పవన్ కథ, స్క్రీన్ ప్లేతో సినిమా వచ్చింది. ఆ సినిమాను బాబి డైరెక్ట్ చేశారు. మొత్తానికి హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కచ్చితంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి వార్తే.