హిమాలయాల్లో సంచరిస్తున్నది మనిషి కాదట: నేపాల్‌ ఆర్మీ అధికారులు

SMTV Desk 2019-05-03 10:13:25  himalayas, mountain man, bear, snow place

న్యూఢిల్లీ, మే 02: హిమాలయాల్లోని మంచు పర్వతాల్లో యతి (మంచు మనిషి) తిరుగుతోందన్న భారత్‌ ఆర్మీ అధికారుల ప్రకటనను నేపాల్‌ ఆర్మీ అధికారులు ఖండించారు. తాజా సమాచారం ప్రకారం.....అవి ఎలుగు బంటి పాద ముద్రలని, తరచూ ఈ ముద్రలు ఆ ప్రాంతంలో కనిపిస్తుంటాయని స్పష్టం చేశారు.

మేజర్‌ మనోజ్‌ నేతృత్వంలోని 18 మంది సైనికుల బృందం ఏప్రిల్‌ 2న నేపాల్‌ మకల్‌ పర్వతారోహణకు బయలుదేరి వెళ్లింది. పర్వతారోహణ చేస్తున్న తమకు మకలు బేస్‌ క్యాంపు వద్ద యతి పాదముద్రలు కనిపించాయని ఈ బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్న పాదముద్రల ఫొటోలను ఏప్రిల్‌ 9న ఓ అధికారి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అయితే భారత్‌ ఆర్మీ అధికారుల ప్రకటనపై నేపాల్‌ అధికారులు స్పందిస్తూ అవి ఎలుగు బంటి పాదముద్రలేనని స్పష్టం చేశారు.