అసలే జీతాల కొరత...ఇప్పుడు సేవింగ్స్ కోత; ఇది జెట్ ఎయిర్ వేస్ నిర్వాకం

SMTV Desk 2019-05-02 19:28:45  jet airways, jet employees, international pilots, jet airways loss

న్యూఢిల్లీ, మే 02: తాత్కాలికంగా సర్వీసులు నిలిచిపోవడంతో ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. నాలుగైదు నెలల నుంచి కంపెనీ జీతాలు చెల్లించకపోవడంతో జెట్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు, కంపెనీలు పలువురు జెట్ ఉద్యోగులకు ఉద్యోగాలు ఆఫర్ చేసి వాళ్లను ఆదుకునే ప్రయత్నం చేస్తున్న విషయం విదితమే.

అసలే నాలుగైదు నెలల నుంచి జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జెట్ ఉద్యోగుల నెత్తిపై మరో పిడుగు పడింది. విదేశాల్లో వెచ్చించే ఖర్చులపై జాగ్రత్త కోసం అంతర్జాతీయ విమానాలను ఆపరేట్ చేస్తున్న జెట్ ఉద్యోగస్థులకు ఇచ్చిన ప్రీ-పెయిడ్ ఫోరెక్స్ కార్డులు బుధవారం నుంచి అర్థాంతరంగా నిలిచిపోయాయి.

దాదాపు 1000 మంది క్యాబిన్ సిబ్బంది, 300మంది పైలట్లపై దీని ప్రభావం పడింది. వివిధ ట్రిప్పుల్లో ఉద్యోగులు సేవ్ చేసిన డబ్బులు ఈ కార్డ్స్ లో ఉన్నాయి. అసలే జీతాలు లేక ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఇలా జరగడం తమకు తీవ్ర ఆవేదన కలిగించిందని ఓ జెట్ ఉద్యోగి తెలిపారు.

కొంతమంది జెట్ ఉద్యోగులవి 2వేల డాలర్ల వరకు ఫోరెక్స్ కార్డుల్లో సేవింగ్స్ ఉన్నాయి. కాగా జెట్ ఉద్యోగులు యాక్సిక్ బ్యాంకు కార్డులను ఉపయోగిస్తున్నారు. జెట్ కి క్లయింట్ గా ఉన్న విజ్ మాన్ ఫోరెక్స్ కంపెనీ యాక్సిక్ బ్యాంకుకి కార్డ్ డిస్టిబ్యూటర్ గా ఉంది. జెట్, ఫోరెక్స్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం..జెట్ ఉద్యోగుల ఫోరెక్స్ కార్డుల ట్రాన్సాక్షన్ లో బ్యాంకు ఎలాంటి పాత్ర పోషించదని యాక్సిక్ బ్యాంక్ సృష్టం చేసింది.

జెట్ ఉద్యోగుల ప్రీపెయిడ్ ఫోరెక్స్ కార్డులు స్థంభిచడంపై విజిమాన్ ఫోరెక్స్ కి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ...వాస్తవానికి కొన్ని కార్డులు ఇప్పుడు స్థంభించిన మాట నిజమే. జెట్ మా దగ్గర 1.62 కోట్లు రుణం తీసుకుంది. ఒక్క నెల కూడా జెట్ పేమెంట్ చెయ్యలేదు.పేమెంట్ చెల్లించకపోవడంతో మేం కొన్ని కార్డులను స్థంభింప చేయాల్సి వచ్చింది.

జెట్ అప్పు చెల్లించకుండా పొడిగించకుండా ఉండేందుకే కార్డులలోని డబ్బులు స్థంభింపచేసి ఆ మొత్తాన్ని ఎస్క్రో అకౌంట్ లో ఉంచినట్లు ఆయన తెలిపారు. 10ఏళ్లుగా జెట్ కి విజ్ మాన్ క్లయింట్ గా ఉంది. జెట్ కి ఆర్థిక కష్టాలు మొదలైనప్పటి నుంచి విజ్ మాన్ ఫోరెక్స్ కి పేమెంట్స్ చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహించిందని ఆయన తెలిపారు.