డీ2హెచ్ నయా ఆఫర్

SMTV Desk 2019-05-02 15:28:25  d2h, dish tv

డిష్ టీవీకి చెందిన డీ2హెచ్ కస్టమర్లకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ గ్రామీణ, చిన్న చిన్న పట్టణ ప్రాంతాల్లోని కస్టమర్లు లక్ష్యంగా చేసుకొని వ్యాల్యూ కాంబో ఆఫర్ విత్ ఇండియా క్రికెట్ అనే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర రూ.1,292 నుంచి ప్రారంభమౌతోంది. ఇక 12 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూ.2,033 ప్లాన్. స్టాండర్డ్ డెఫినేషన్ (ఎస్‌డీ) సెట్ టాప్ బాక్స్, ఇన్‌స్టాలేషన్ ఉచితం. ఈ ఆఫర్‌లో ఇండియా క్రికెట్ కూడా ఉంటుంది. ఇది యాడ్ ఆన్ సర్వీస్ రూపంలో పొందొచ్చు. ‘టైర్ 3, టైర్ 4 మార్కెట్లలో చాలా మంది ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోల్పోతున్నారు. వారి కోసమే ఈ కొత్త ఆఫర్ తీసుకువచ్చాం’ అని డిష్ టీవీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో అనిల్ దుయా తెలిపారు. తాజా ఆఫర్‌కు సంబంధించి కంపెనీ ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది.