ఓ స్పెషల్ లొకేషన్ నుంచి స్పెషల్ అనౌన్స్ మెంట్: మంచు విష్ణు

SMTV Desk 2019-05-02 13:54:33  manchu vishnu, manchu family, mohan babu

హైదరాబాద్, మే 02: మంచు వారింట్లోకి మరో నూతన అతిథి రానున్నాడు. మంచు విష్ణు నాలుగో బిడ్డకు తండ్రి కానున్నాడు. సతీమణి విరానిక రెడ్డి ప్రస్తుతం కడుపుతో ఉంది. ఇక ఇదే విషయాన్ని తొలిసారిగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన విష్ణు........ "ఓ స్పెషల్ లొకేషన్ నుంచి స్పెషల్ అనౌన్స్ మెంట్. వినీ స్వగ్రామం, నా ఫేవరెట్ ప్లేస్ ఇది. అరి, వివి, అవ్రామ్ ల తరువాత నాలుగో లిటిల్ ఏంజల్ వచ్చి చేరనుందని చెప్పేందుకు సంతోషిస్తున్నా" అని అన్నాడు. విష్ణు దంపతులకు తొలుత అరియానా, వివియానా కవలలు, ఆ తరువాత అవ్రామ్ అనే బాబు జన్మించాడన్న సంగతి తెలిసిందే. ఇక మంచు విష్ణు దంపతులకు పలువురు శుభాభినందనలు తెలుపుతున్నారు.