మహర్షి ట్రైలర్ కట్ చేస్తే .. గూస్బంప్స్ గ్యారంటీ

SMTV Desk 2019-05-02 12:30:01  Maharshi, Mahesh Babu,

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం మహర్షి. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం లో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా వంశీ పైడి పల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్ పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో బారి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్ ప్లాజాలో చాలా ఘనంగా జరిగింది.కాగా ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే మహర్షి సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు నటించిన 25 సినిమాల దర్శకులు, హీరోయిన్లు అందించిన స్పెషల్ గ్రీటింగ్స్‌కు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. కాగా ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరిని కూడా విస్మయానికి గురి చేస్తుంది. ఈ ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నాను అని మహేష్ బాబు చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది. అంతే కాకుండా మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజ హెగ్డే లు స్నేహితులుగా కనిపించనున్నారు. కాగా ఈ చిత్రాన్ని మే 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.