అంతర్జాతీయ ఉగ్రవాదిగా జైషే మహమ్మద్‌ అధినేత... మన్మోహన్ సింగ్ ఆనందం

SMTV Desk 2019-05-02 12:28:44  Manmohan Singh, Massod azar

జైషే మహమ్మద్‌ అధినేత మసూద్ అజరను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా మసూద్ అజర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలని భారత్ పోరాడుతుంది. ఎట్టకేలకు పోరాటం ఫలించి.. ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్ పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడింది. ఇది చాలా సంతోషకరమైన విషయం అని ఆయన అన్నారు.

జైషే మహమ్మద్‌ అధినేత మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించినట్లు.. భారత అంబాసిడర్‌ సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాను. దీంతో అంతర్జాతీయంగా భారత్ దౌత్యం ఫలించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి అతని ఆస్తులు, ఆర్థిక లావాదేవీలను ఐక్యరాజ్య సమితి స్తంభింపజేసింది.