విద్యార్థులను బట్టలు విప్పమని వేధించిన హాస్టల్‌ వార్డెన్లు

SMTV Desk 2019-05-01 17:57:49  hostel wardens, punjab, akaal university, bathinda

బతిండా, మే 01: మహిళలు నెలసరి సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్స్‌ వాడి ఎవరూ పడేశారో తెలుసుకునేందుకు బట్టలు విప్పమని విద్యార్థినులను వేధించిన ఘటన పంజాబ్‌లోని అకాల్‌ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. కాగా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు హాస్టల్‌ వార్డెన్లు అక్కడి విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు.

ఈ దారుణ సంఘటన నేపథ్యంలో విద్యార్థినులు యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు. దీంతో బతిండా వర్సిటీ వద్ద గత 2 రోజులుగా ఉద్రిక్తత నెలకొంది. అసలేం జరిగిందంటే… ఉపయోగించిన శానిటరీ ప్యాడ్స్‌ను హాస్టల్‌ వాష్‌రూమ్‌లో పడేశారు. దీంతో ఇద్దరు హాస్టల్‌ వార్డెన్స్‌, ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులు కలిసి వాటిని ఎవరూ పడేశారో చెప్పాలని అమ్మాయిలను వేధించారు.

అంతటితో ఆగకుండా ఎవరూ పడేశారో తెలుసుకునేందుకు....... హాస్టల్‌లోని విద్యార్థినులందరినీ బట్టలు విప్పాలని వార్డెన్లు ఆదేశించారు. దాంతో విద్యార్థునులందరూ నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై విద్యార్థినులు యూనివర్సిటీ డీన్ ఎంఎస్‌ జోహల్‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు వార్డెన్లతో పాటు సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తప్పించారు.