అమ్మకాల్లో శాంసంగ్ టాప్

SMTV Desk 2019-05-01 17:50:42  samsung, samsung smartphones, samsung galaxy s10

ఎలక్ట్రానిక్స్ తయారీల దిగ్గజం శాంసంగ్ నుండి ఈ మధ్య వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్10 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు దూసుకెల్తున్నాయి. కంపెనీ 2019 తొలి త్రైమాసికంలో 7.8 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది. అదేసమయంలో 50 లక్షల యూనిట్ల ట్యాబ్లెట్స్‌ను కస్టమర్లకు విక్రయించింది. శాంసంగ్ నిర్వహణ లాభం ఈ ఏడాది క్యూ1లో 5.4 బిలియన్ డాలర్లకు తగ్గింది. గతేడాది క్యూ1లో కంపెనీ లాభం 13.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో ఆదాయం 13.5 శాతం క్షీణించింది.