టీమిండియా హెడ్‌ కోచ్‌గా రికీ పాంటింగ్‌!

SMTV Desk 2019-05-01 17:48:10  ricky panting, sourav ganguly, team india head coach

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు హెడ్‌ కోచ్‌గా రికీ పాంటింగ్‌ ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పిచెప్పనట్టుగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే ప్రస్తుతం టీమిండియా కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి గడువు ప్రపంచకప్‌ 2019తో ముగియనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి హెడ్‌ కోచ్‌గా రికీ పాంటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం అదే టీమ్‌కి సలహాదారుడిగా పనిచేస్తున్న గంగూలీ.. అతనితో కలిసి ఇప్పుడు ఢిల్లీని పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలపడమే కాకుండా.. ప్లేఆఫ్‌కి కూడా చేర్చాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతుండగా.. ‘పాంటింగ్ భవిష్యత్‌లో టీమిండియాకి హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా..?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి దాదా.. పరోక్షంగా అవుననే సంకేతాలిచ్చాడు. ‘రికీ పాంటింగ్‌‌నే ఈ ప్రశ్న మీరు అడగాలి. ఎందుకంటే.. అతను ఏడాదిలో 8 నుంచి 9 నెలలు ఇంటికి దూరంగా ఉండగలడా..? ఒకవేళ అతను ఉండగలను అంటే మాత్రం.. నిస్సందేహంగా టీమిండియా‌కి గొప్ప కోచ్‌గా అతను నిలుస్తాడు. ఇప్పుడంటే.. మేము ఒక జట్టుకి పనిచేస్తున్నాము. కానీ.. మేము ఎప్పటి నుంచో మంచి స్నేహితులం. ఢిల్లీ టీమ్‌లోని కుర్రాళ్లతో కలిసి అతను చాలా చక్కగా పనిచేస్తున్నాడు. దాని ఫలితమే ఇప్పుడు ఆ జట్టు ప్లేఆఫ్‌కి చేరడం’ అని గంగూలీ వెల్లడించాడు. 2012 తర్వాత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్‌కి చేరడం ఇదే తొలిసారి..!