వారణాసిలో ఇస్మార్ట్ శంకర్

SMTV Desk 2019-05-01 15:26:32  Ram pothineni, Puri jagannad, Ishmart Shankar Movie, Remuneration, nidhi agarwal, nabha natesh, charmie, dimakh kharab song, varanasi shooting

వారణాసి: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. డబుల్ దిమాక్ హైదరాబాది అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను బుధవారం నుండి వారణాసిలో చిత్రీకరించనున్నారు. సినిమా కీలక ఘట్టంలో ఈ యాక్షన్ పార్ట్ ఉంటుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ భారీ రేంజ్‌లో ఈ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారు. పూరి స్టయిల్లో రియల్ సతీష్ ఈ యాక్షన్ పార్టును తెరకెక్కించబోతున్నారు. హీరోహీరోయిన్లు రామ్, నిధి అగర్వాల్‌తో పాటు ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, దీపక్ శెట్టి, తులసి తదితరులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.