సుఖవ్యాధికి సుఖంగా పనిచేసే మందులు

SMTV Desk 2019-05-01 14:54:28  Sukha Vyadi

గనోరియా సుఖవ్యాధి వచ్చినప్పుడు జననాంగం లొంచి చీము ,వాపు ,నొప్పి ,మూత్రం మంటగా వెళ్లడం వంటి బాధలుంటాయి .

బొంత అరటికాయని తరచూ కూరగా వండుకొని తినండి . ఈ అరటికాయ బాగా ముదిరింది తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తగా దంచి ఒక సీసాలో అట్టేపెట్టుకొని రోజూ ఒక
చెంచా మోతాదులో మూడుపూటలా పంచదారతో తినండి . ఈ సెగరోగంలో చక్కటి ఉపశమనం కన్పిస్తుంది .

ఆగకరకాయల కూర చాలా మేలు చేస్తుంది . పల్లెరుకాయల మొక్కని వ్రేళ్లతో సహా తెచ్చుకొని ,శుభ్రంచేసి ,ఎండబెట్టి మెత్తగా దంచి భద్రపరచుకొండి .రోజూ 2 చెంచాలాపొడిని 2గ్లాసుల నీళ్ళుపోసి అరగ్లాసు నీరు మిగిలేలా కాషాయం కాచి తాగండి . అవసరం అయితే కొద్దిగా తీపి కలుపుకొండి . వీలైతే రెండు పూటలా తీసుకొండి .తంగెడుపూలు ,వట్టివేళ్ళు ,తుంగముస్తల్ని కూడా పై పద్దతిలోనే కాషాయం తీసుకొని తాగితే మూత్రంలో మంట ,బాధ ,చీము తగ్గుతాయి .