అదనపు ఇంధనం లేకుండా ఎయిర్ఇండియా విమానం చక్కర్లు

SMTV Desk 2019-04-30 13:40:10  airindia, aeroplane

హైదరాబాద్: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో ఏ సంస్థ విమానాలకు సాధ్యం కానిది ఎయిర్ ఇండియా చేసి చూపించింది. న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఎలాంటి అదనపు ఇంధనం లేకుండా హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద లాండ్ అయింది. విమానాన్ని మళ్లించే సమయంలో ఇప్పటి వరకు అవసరమయ్యే అదనపు ఇంధనం ఈసారి వినియోగించలేదు. అలా చేయడం దేశంలో తొలిసారి కావడం విశేషం. ‘ఎలాంటి అదనపు ఇంధనం వినియోగించని తొలి విమానం దేశంలో ఇదే. ప్రతి రోజూ హైదరాబాద్ వస్తున్న 15 విమానాలకు ఇదే విధానాన్ని అమలు చేస్తాం’ అని ఎయిర్ ఇండియా అధికారి అన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి విమానం గమ్యాన్ని చేరుకునేందుకు అదనంగా ఇంధనాన్ని మోసుకెళ్లాల్సి వచ్చేది. విమానం మళ్లింపునకు ప్రత్యామ్నాయ ఎయిర్‌పోర్ట్ కూడా కావాల్సి వచ్చేదని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఎలాంటి మళ్లింపు లేకపోవడం వల్ల విమాన సంస్థకు అత్యధిక భారం తగ్గనుంది.