పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

SMTV Desk 2019-04-30 13:29:04  Petrol, Deseal, Price, New delhi

న్యూఢిల్లీ: మంగళవారం దేశీ ఇంధన ధరలు కాస్త పైకి కదిలాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.13 వద్ద కొనసాగుతోండగా డీజిల్ ధర రూ.66.71 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.78.70 వద్ద, డీజిల్ ధర రూ.69.83 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో డీజిల్ ధర 5 పైసలు, పెట్రోల్ ధర 5 పైసలు పైకి చేరింది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.77.26 వద్ద, డీజిల్‌ ధర రూ.71.84 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.89, డీజిల్ ధర రూ.71.50 వద్ద కొనసాగుతోంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.29 శాతం తగ్గుదలతో 71.33 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.16 శాతం క్షీణతతో 63.44 డాలర్లకు తగ్గింది.