ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన పంత్

SMTV Desk 2019-04-30 11:02:26  delhi capitals, ipl 2019, rishab pant, mahendra singh dhoni, csk

న్యూఢిల్లీ: ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక పాత్ర పోషిస్తూ జట్టు విజయాలకు అద్భుత ప్రదర్శనతో మెరుస్తూ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు రిషబ్ పంత్. ఈ యువ ఆటగాడు వికెట్ కీపర్ కింగ్ ధోని కూడా సాధ్యంకాని ఓ రికార్డు సృష్టించాడు. ఐపిఎల్‌ ఒకే సీజన్‌లో 20 ఔట్లలో భాగస్వామ్యం వహించిన ఏకైక వికెట్ కీపర్ గా పంత్ రికార్డుకెక్కాడు. మొత్తంగా ఈ ఐపిఎల్ లో ఇప్పటివరకు పంత్ 12 మ్యాచులాడి 15 క్యాచ్‌లు, 5 స్టంపౌట్లు చేయడంతో ఈ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు డెక్కన్ చార్జర్స్ వికెట్ కీపర్ కుమార సంగక్కర(19 ఔట్లు) పేరిట ఉండేది. ఇక నిన్నటి మ్యాచ్ లో బెంగళూరును మట్టికరిపించిన ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.