ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తాజాగా తన వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ కస్టమర్స్ రూ.48 ప్లాన్‌లో 3జిబి డేటా, రూ.98 ప్లాన్‌లో 6జిబి డేటా పొందొచ్చు. రూ.98 ప్లాన్‌లో 10 ఉచిత ఎస్ఎంఎస్‌లు వస్తాయి. నెలవారీ డేటా ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ రెండు ప్యాక్‌లు సరిపోతాయని సంస్థ వెల్లడించింది.ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ గడువు 28 రోజులుగా నిర్ణయించింది. అలాగే రూ.29కే మరో ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ అందిస్తోది. ఇందులో 520ఎంబి డేటా ఇస్తుంది. గడువు 28 రోజులు. ఇక రూ.92కే 6 జిబి డేటా వచ్చే మరో ప్లాన్ ఉంది కాకపోతే ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 7 రోజులుగా ఎయిర్ టెల్ నిర్ణయించింది.