నిరుద్యోగులకు శుభ వార్త

SMTV Desk 2019-04-29 12:58:09  Jobs,

ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) గ్రూప్ సి పరిధిలోని నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, సంబంధిత క్రీడా విభాగంలో నైపుణ్యం ఉన్నఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు : 121 పోస్టులు

విభాగాలు : అథ్లెటిక్స్, జూడో, వాటర్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్ రోయింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, ఉషూ, ఆర్చరీ, షూటింగ్, వింటర్ గేమ్స్ స్కింగ్(అల్పైన్&నార్డిక్), రెజ్లింగ్, కరాటే.

అర్హత : మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా తప్పనిసరి నిర్దిష్ట ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు : 21.06.2019 నాటికి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి)

దరఖాస్తు ఫీజు : రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది)

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..జీతం : నెలకు రూ.21,700/-

దరఖాస్తు ప్రారంభం : 22.04.2109
చివరితేది : 21.06.2019