9 రాష్ట్రాల్లో ప్రారంభమైన నాలుగో విడత ఎన్నికలు

SMTV Desk 2019-04-29 12:35:03  9 states, elections,

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత ఎన్నికలు ఈరోజు 9 రాష్ట్రాల్లోని పలు పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోని ఆరు సహా 71 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. నాలుగో దశలో మొత్తం 945 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక, జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ పార్లమెంటు నియోజకవర్గానికి మూడు దశల్లో ఎన్నికలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏప్రిల్ 24న మూడో విడతలో ఒక దశ పోలింగ్ ముగిసింది.

తాజాగా ఈ నియోజకవర్గం పరిధిలోని 433 కేంద్రాల్లో నాలుగో దశలో పోలింగ్ జరుగుతోంది. ఈరోజు జరుగుతోన్న నాలుగో దశ పోలింగ్‌తో కలిపితే మొత్తం 373 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిసినట్లవుతుంది. ఈ దశలో మొత్తం 71 నియోజకవర్గాల్లో 13.56 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు. పురుష ఓటర్లు 7.50 కోట్లు, మహిళా ఓటర్లు 6.06 కోట్లు. వీరి కోసం మొత్తం 1,40,849 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ దశలోని మహారాష్ట్రాలోని 17, పశ్చిమ్ బెంగాల్‌లోని 8, రాజస్థాన్ 13, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 13 పార్లమెంటు స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.