మార్కెట్లో హళ్ చల్ చేస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌

SMTV Desk 2019-04-29 11:26:04  Royal enfield, classic 350, himalayan, interceptor, continental gt

హైదరాబాద్: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్కి మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉందొ తెలిసిందే. ఈ బైక్ కి ఇప్పటివరకూ మరేఇతర కంపెనీల బైక్స్ కూడా పోటీపడలేకపోతున్నాయి. 250-500సీసీ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ దూసుకెళ్తున్నాయి. మరేఇతర కంపెనీ బైక్స్ కూడా వీటికి పోటీ ఇచ్చే స్థాయిలో లేకపోవడం గమనార్హం. రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్చి నెల విక్రయాలను గమనిస్తే.. క్లాసిక్ సిరీస్ బైక్స్ అమ్మకాలు 3,183 యూనిట్లుగా ఉన్నాయి. బుల్లెట్ బైక్స్ విక్రయాలు 13,495 యూనిట్లుగా, థండర్‌బర్డ్ అమ్మకాలు 5,091 యూనిట్లుగా నమోదయ్యాయి. మూడు రకాల బైక్స్ అందుబాటులో ఉండటంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక కేటీఎం 250 బైక్స్ అమ్మకాలు 617 యూనిట్లుగా, కేటీఎం 390 బైక్స్ విక్రయాలు 470 యూనిట్లుగా ఉన్నాయి. బజాజ్ డామినర్ అమ్మకాలు కేవలం 350 యూనిట్లుగా మాత్రమే నమదయ్యాయి. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్స్ అమ్మకాలు 279 యూనిట్లుగా, మహీంద్రా మోజో బైక్స్ అమ్మకాలు 171 యూనిట్లుగా ఉన్నాయి.