మోడీ పై మండిపడ్డ దిగ్విజయ్ సింగ్

SMTV Desk 2019-04-28 18:45:32  Modi, Digvijay SIngh

భోపాల్: భారత దేశంలో ఉన్న అన్ని మతాల వారు సోదరులేనని భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. బిజెపి వాళ్లు హిందువులకు ప్రమాదం పొంచి ఉందని మాయమాటలు చెబుతూ అందరూ ఏకం కావాలని పిలుపునిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మతం అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేసేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. హిందువులు హర్ హర్ మహదేవ్ అనే సంభోదిస్తే… బిజెపి కార్యకర్తలు, నాయకులు హర్ హర్ మోడీ అని పలుకుతున్నారని చురకలంటించారు. గూగుల్‌లో అబద్ధామాడే వ్యక్తి ఎవరు(fake person) అని సెర్చ్ చేస్తే మోడీ పేరు వస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భోపాల్ లోక సభ నియోజకవర్గానికి తన పేరు నిర్ణయించగానే… మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనని టార్గెట్ చేశారని,.. బిజెపి తరుఫున పోటీ చేయాలని పలువురిని సంప్రదించారని, ఉమా భారతి పోటీ చేయనని చెప్పిందని, గౌర్ కూడా తనకు అనారోగ్యంగా ఉందని తప్పుకున్నాడని, నామినేషన్ దాఖలు చివరి రోజున సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ను భోపాల్ ఎంపి అభ్యర్థిగా బిజెపి ప్రకటించిందని మండిపడ్డారు. 26/11 దాడులలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఎటిఎస్ హేమంత్ కర్కరేను తాను శపించడంతో చనిపోయాడని ప్రగ్యా చెప్పారని, అలా అయితే పాకిస్తాన్ తీవ్రవాది మసూద్‌ను శపిస్తే సరిపోతుందని, సర్జికల్ దాడులు ఎందుకు చేయాల్సి వచ్చిందని దుయ్యబట్టారు.