మిమి చక్రవర్తి ఆస్తులు తెలుసా

SMTV Desk 2019-04-28 18:33:51  Mimi Chakravarthi.

ప్రముఖ బెంగాలీ నటి.. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మిమి చక్రవర్తి తన ఆస్తులను రూ.2.43 కోట్లుగా అఫిడవిట్ లో వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మిమి చక్రవర్తి జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా మిమి చక్రవర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆ నటి ఈ వివరాలను తెలిపారు.

మిమి చక్రవర్తి తన ఆస్తుల మొత్తం విలువ రూ.2.43 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఆమె చేతిలో రూ.25వేల నగదు ఉన్నట్టు తెలిపారు. బ్యాంకులో రూ.71.89 లక్షలు డిపాజిట్ల రూపంలో ఉందని అన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 50 వేల వరకు మ్యాచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వివరించారు.

అదేవిధంగా తన వద్ద 271.4 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని.. అందులో రూ.3.26 లక్షల విలువైన ఆభరణాలు వారసత్వంగా వచ్చినట్లుగా వివరించారు. అలాగే... రూ.5.59 లక్షల విలువైన 171.4 గ్రాముల ఆభరణాలను తాను కొనుగోలు చేశానని అఫిడవిట్‌లో తెలిపారు. కోల్‌కతాలో రూ.1.19 కోట్ల విలువ చేసే ఓ ఫ్లాట్, రెండు కార్లు కూడా ఉన్నట్టు వెల్లడించారు. 30 ఏళ్ల మిమి ఫైన్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లుగా వెల్లడించారు. 2017-18లో తన వార్షిక ఆదాయం రూ.15.39 లక్షలుగా వివరించారు.