’28°C’ టీజర్ చూసారా

SMTV Desk 2019-04-28 13:00:07  28 degree teaser

న‌వీన్ చంద్ర కథానాయకుడిగా.. చిత్ర పరిశ్రమకు నూతనంగా పరిచయమవుతున్న డైరెక్టర్‌ అనీల్‌ విశ్వనాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం 28°C. షాలినీ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కతోన్న చిత్ర టీజర్‌ విడుదలైంది. టీజర్‌ లో హీరో ఓ కొత్త మానసికంగా వ్యాధితో బాధపడుతున్నట్లు చూపించారు. మెదడుకు తగిలిన గాయం కారణంగా ‘మానసికంగా ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటాడు. నవీన్‌ చంద్రా ఎప్పుడూ కన్‌స్టెంట్‌ టెంపరేజర్‌(స్థిరంగా ఉండే ఉష్ణోగ్రత)లో ఉండాలని.. లేదంటే 10-15 నిమిషాల్లో చనిపోతాడని డాక్టర్‌ చెప్తాడు. చివర్లో చ‌నిపోయిన వాళ్ళు తిరిగి వ‌స్తారా అనే ప్ర‌శ్న‌తో టీజ‌ర్ ముగుస్తుంది. కొత్త కాన్సెప్ట్ తో ముందుకొస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.