అభిషేక్ బెనర్జీ కిరాక్ ప్లాన్ చూసారా ?

SMTV Desk 2019-04-28 12:52:59  Abhishek benerjee,

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ ఎన్నికల ప్రచారంలో కిరాక్ ప్లాన్ వేసి వైరల్ అయిపోయాడు.ఎండవేడిమి నుంచి తప్పించుకోవడానికేనా అన్నట్టుగా.. ఆయన చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అభిషేక్ పోటీ చేస్తున్న డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో టీఎంసీ కార్యకర్తలు ఆయన విగ్రహాన్ని ఓపెన్ టాప్ జీప్‌లో నిలబెట్టి ప్రచారం చేస్తున్న ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. చేతులు కట్టుకుని నిబడినట్టుగా ఉన్న అభిషేక్ విగ్రహానికి పార్టీ కార్యకర్తలు పూలదండలు వేసి, నినాదాలు చేస్తూ ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది.

అయితే కొన్నిరోజులుగా ఎండ చావగొట్టేస్తుండడం కొత్త ఐడియాకు శ్రీకారం చుట్టాడు. నమస్కసరిస్తున్న భంగిమలో తన బొమ్మను తయారు చేయించి, ఓ టాప్ లేని జీపులో తెగ తిప్పేస్తున్నాడు. బొమ్మతో కార్యకర్తలు చేస్తున్న హడావుడి చూసి జనం ఇదెక్కడ చోద్యం అని నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇవి దిగజారుడు రాజకీయాలని కొందరు, ఆరోగ్యం కోసం తీసుకుంటున్న జాగ్రత్త అని మరికొందరు చెప్పుకుంటున్నారు. కాగా, అభిషేక్ భార్య ఇటీవల బంగారాన్ని తీసుకెళ్తూ కోల్‌కతా ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిపోయిందని వార్తలు వస్తున్నాయి. అవి అబద్ధమని అభిషేక్ చెబుతున్నారు.