బ్రేకింగ్ ...‘నువ్వు తోపు రా’ హీరోకు గాయాలు

SMTV Desk 2019-04-27 16:00:52  nuvvu thopura

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరోకి తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే ఓ మహిళ మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలలోకి వెళ్తే... మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. యువ హీరో సుధాకర్‌ గాయపడ్డాడు.

అయితే సుధాకర్.. శేఖర్‌కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాతో వెండితెరకు పరిచయయ్యారు. తాజాగా ఆయన హీరోగా చేసిన నువ్వు తోపురా సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. కాగా జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్‌ కారు ఢీకొట్టడంతో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందగా.. కారులో ఉన్న నటుడు గాయాలతో బయటపడ్డారని తెలుస్తోంది.