సొంత గడ్డపై చెన్నైని చిత్తు చేసిన ముంభై

SMTV Desk 2019-04-27 11:56:09  ipl 2019, csk vs mi

చెన్నై: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నైలోని చేపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లోముంబయి ఇండియన్స్ జట్టు 46 పరుగుల తేడాతో చెన్నైని చిత్తూ చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ని ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన ముంభై జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ (15: 9 బంతుల్లో 1x4, 1x6) పరుగులతో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే హర్భజన్ బౌలింగ్‌లో డికాక్ ఔటవగా.. అనంతరం వచ్చిన ఎవిన్ లావిస్ (32: 30 బంతుల్లో 3x4, 1x6) వేగంగా ఆడలేకపోయాడు. దీంతో.. కెప్టెన్ రోహిత్ శర్మపైనా ఒత్తిడి పెరిగింది. అయితే.. జట్టు స్కోరు 99 వద్ద లావిస్ ఔటవగా.. అనంతరం కాసేపు బ్యాట్ ఝళిపించిన రోహిత్ శర్మ అర్ధశతకం తర్వాత శాంట్నర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టబోయి ఔటయ్యాడు. పవర్ హిట్టర్లు కీరన్ పొలార్డ్ (13 నాటౌట్: 12 బంతుల్లో 2x4), హార్దిక్ పాండ్య (23 నాటౌట్: 18 బంతుల్లో 1x4, 1x6) ఆఖర్లో ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో ముంబయి ఇండియన్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేయగలిగింది. ఛేదనలో చెన్నై ఓపెనర్ మురళీ విజయ్ (38: 35 బంతుల్లో 3x4, 1x6) ఫర్వాలేదనిపించినా.. షేన్ వాట్సన్ (8), సురేశ్ రైనా (2), అంబటి రాయుడు (0), కేదార్ జాదవ్ (6), ధ్రువ్ షోరే (5) నిరాశపరిచారు. అయితే.. మిడిల్ ఓవర్లలో కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్టవేసిన డ్వేన్ బ్రావో (20: 17 బంతుల్లో 2x4), మిచెల్ శాంట్నర్ (22: 20 బంతుల్లో 2x6) జోడీ.. చెన్నై శిబిరంలో ఆశలు రేపినా.. బంతులు, పరుగుల మధ్య అంతరం పెరిగిపోవడంతో ఇద్దరూ ఔటైపోయారు. ఆఖర్లో దీపక్ చాహర్ (0), హర్భజన్ సింగ్ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. తాజా గెలుపుతో టోర్నీలో ఏడో విజయాన్ని అందుకున్న ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా.. చెన్నై సూపర్ కింగ్స్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జ్వరం కారణంగా ఈ మ్యాచ్‌కి చెన్నై కెప్టెన్ ధోనీ దూరమవగా.. సురేశ్ రైనా.. జట్టుని నడిపించాడు. మ్యాచ్‌లో కీలకమైన అర్ధశతకం బాదిన రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.