‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల ఎప్పుడంటే

SMTV Desk 2019-04-27 11:48:28  laksmis ntr,

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు సానుకూల స్పందన లభించింది. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతిపై ఉన్న అపోహలు తొలగిపోయాయని, నిజాలు బయటికొచ్చాయని అంటున్నారు.

అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా తీయడంతో ఏపీలో దీన్ని నిషేధించారు. ఇది ఎన్నికలను ప్రభావితం చేస్తుందని కొందరు కోర్టుకెక్కడంతో కోర్టు కూడా విడుదలను నో చెప్పింది. అయితే తెలంగాణతో, ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని ఏపీ ప్రజల్లో కొందరు తమకు అందుబాటులో ఉన్న మార్గాల్లో చూసేశారు. తాజాగా దీనికి ఏపీలోనూ అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీలో ఎన్నికలు ముగియడంతో అక్కడ ప్రదర్శించడానికి నిర్మాతలకు అనుమతులు లభించాయి. మే 1న దీన్ని విడదుల చేయనున్నారు.