133.92 కోట్లకు భారత్‌ జనాభా

SMTV Desk 2019-04-27 11:45:49  india popullation,

1962లో భారతదేశ జనాభా 44.95 కోట్లు ఉండేది. అది 1972 నాటికి 57.94 కోట్లు, 1982 నాటికి 72.99 కోట్లు,1992 నాటికి 90.06 కోట్లు 2002 నాటికి 108.98 కోట్లు 2012 నాటికి 126.31 కోట్లు 2017నాటికి 133.92 కోట్లు అయ్యింది.

ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, 1962లో చైనా దేశ జనాభా మనకంటే 21.63 కోట్లు ఎక్కువగా అంటే 66.58 కోట్లు ఉండేది. కానీ 2017 వచ్చేసరికి చైనా జనాభా 138.64 కోట్లకు చేరుకోగా, దానితో ఇంచుమించు సమానస్థాయికి అంటే 133.92 కోట్లకు భారత్‌ జనాభా చేరుకొంది.

మారుతున్న ఆర్ధిక, సామాజిక పరిస్థితుల కారణంగా ఇప్పుడు నగరాలు, పట్టణాలలో ఎవరూ కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువమంది కనడానికి ఇష్టపడటం లేదు. గ్రామాలలో నిరక్షరాస్యులు సైతం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకే పరిమితం అవుతుండటం సంతోషించవలసిన విషయమే. కానీ నేటికీ కొన్ని వర్గాలు, కొన్ని ప్రాంతాలలో మూడాచారాలు, ఆనవాయితీలు, కట్టుబాట్లు పేరిట ముగ్గురు కంటే ఎక్కువమంది పిల్లలను కంటున్నవారు కూడా ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ పాటిస్తున్నందునే నేడు దేశ జనాభా పెరుగుదల వేగం కాస్త తగ్గింది లేకుంటే పాత ఆలోచనలతో కొనసాగి ఉండి ఉంటే నేడు దేశాజనాభా 200 కోట్లు దాటిపోయుండేదేమో?

చివరిసారిగా 2011లో దేశజనాభాను లెక్కించారు. కనుక ఆనవాయితీ ప్రకారం ప్రతీ 10 ఏళ్ళకు ఒకసారి నిర్వహించే జనగణన కార్యక్రమాన్ని 2021 మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ జమ్ముకశ్మీర్‌, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో మాత్రం 2020 అక్టోబర్ 1వ తేదీ నుంచి జగణన కార్యక్రమం మొదలవుతుంది.