శత్రుఘన్ సిన్హాతో VS రవిశంకర్ ప్రసాద్

SMTV Desk 2019-04-27 11:07:01  ravi shanker, Shatrugna sinha

కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ పాట్నా సాహిబ్ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న రవిశంకర్… ఈ దఫా ఎన్నికల్లో ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన సినీ నటుడు, కేంద్రమాజీ మంత్రి శత్రుఘన్ సిన్హాతో పాట్నా సాహిబ్ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. కాగా గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో నిలిచిన శత్రుఘన్ సిన్హా.. కాంగ్రెస్ అభ్యర్థి కునాల్ సింగ్ పై విజయం సాధించారు.