అఖిల్ తో కన్నడ భామ

SMTV Desk 2019-04-26 16:10:16  Akhil, Rashmika,

అక్కినేని యువ హీరో అఖిల్ చేసిన 3 సినిమాలు నిరాశపరచడంతో ఈసారి మరింత జాగ్రత్తగా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో అఖిల్ 4వ సినిమా వస్తుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నని సెలెక్ట్ చేశారట. ఆల్రెడీ గీతా ఆర్ట్స్ లో వచ్చిన గీతా గోవిందం సినిమాలో అమ్మడు నటించి మెప్పించింది.

ప్రస్తుతం తెలుగులో రష్మికకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. విజయ్ దేవరకొండతో చేస్తున్న డియర్ కామ్రేడ్ చివరి దశకు చేరుకోగా నితిన్ తో భీష్మ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. వాటితో పాటుగా అఖిల్ తో ఛాన్స్ అంటే అమ్మడి లక్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదే కాదు సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో సినిమాకు రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. మహేష్ పక్కన ఛాన్స్ పట్టేస్తే ఇక టాలీవుడ్ టాప్ హీరోయిన్ చెయిర్ అమ్మడికి రాసిచ్చేయొచ్చు.