దంబుల్లా వన్డేలో భారత్ ఘన విజయం

SMTV Desk 2017-08-21 10:31:01  BCCI, India, Srilanka, ODI Series, Rangiri Dambulla International Stadium, Dambulla, IND VS SRILANKA 2017, 1st ODI

నంద్యాల, ఆగస్ట్ 21: శ్రీలంక-బారత్ ల మధ్య దంబుల్లాలో జరిగిన తొలి వన్డేలో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. మొదటగా క్రీజ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ, ధావన్ ల భాగస్వామ్యం ఎక్కువసేపు నిలవలేదు. రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ కోహ్లీ, ధావన్ తో జతకట్టి నిలకడగా రాణించాడు. వీరిద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో కేవలం 28.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయిన భారత జట్టు 220 పరుగులు సాధించింది. భారత బ్యాట్స్‌మెన్స్ రోహిత్ శర్మ(4), ధావన్ 132, కోహ్లీ 70 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. టీమిండియా స్కోర్ ఒక వికెట్ పతనంతో 220పరుగులు సాధించింది. దంబుల్లా వేదికగా ధావన్, వన్డేల్లో తన 11వ శతకం పూర్తి చేశాడు. కేవలం 71 బంతుల్లోనే ధావన్ ఈ సెంచరీ కొట్టడం విశేషం. కాగా, మరొవైపు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్ లో 44వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.